మడివాల మాచిదేవుని జయంతి
ABN, Publish Date - Feb 03 , 2025 | 12:29 AM
రజకుల కుల దైవమైన మడివాల మాచిదేవుని జయంతి వేడుకలను రజక సంఘం నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ధర్మవరం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రజకుల కుల దైవమైన మడివాల మాచిదేవుని జయంతి వేడుకలను రజక సంఘం నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక షిర్డీసాయిబాబా ఆలయ సమీపంలో గంగమ్మ ఆలయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రజక సంఘం నాయ కులు, టీడీపీ నాయకులు మడివాల మాచిదేవుని చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీకృష్ణదేవర రాయల విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఇందులో ఏపీ సీడ్స్ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్ కమతం కాటమయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, టీడీపీ రజక సాధికార సమితి హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ మాల్యవంతం నారాయణస్వామి, టీడీపీ నాయకులు మాధవరెడ్డి, జైలర్ వెంకటేశ, కుంటిమద్ది ముత్యాలు, కృష్ణాపురం మస్తానప్ప, మాల్యవంతం వెంకటేశ, మాల్యవంతం మురళి, సాకే రమేశ పాల్గొన్నారు.
Updated Date - Feb 03 , 2025 | 12:29 AM