ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యోగి వేమన గొప్ప దార్శనీకులు

ABN, Publish Date - Jan 19 , 2025 | 11:35 PM

తెలుగు సామ్రా జ్యాన్ని చైతన్య పరిచిన మహాకవి యోగి వేమన గొప్ప సంఘ సంస్కర్త, దార్శనీకులని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు.

యోగి వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌, అధికారులు

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలుగు సామ్రా జ్యాన్ని చైతన్య పరిచిన మహాకవి యోగి వేమన గొప్ప సంఘ సంస్కర్త, దార్శనీకులని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అన్నారు. ఆదివారం యోగి వేమన జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా, తేలికైన పదజాలంతో రచించిన వేమన పద్యాలను అన్ని తరాల ప్రజలు అంగీకరించేలా ఉన్నాయని అన్నారు. పామరులు, పండితులను అలరించిన ఆయన కవిత్వం ఎంతో గొప్పదన్నారు. సమాజంలో ఉన్న దురాచారాలపై ఆనాడే తన పద్యాలతో సమాజంలో చైతన్యం రగిలించారన్నారు. వారి రచనల్లో మానవత్వంతో కూడా మిళితమై ఉందని, అలాంటి గొప్ప కవి గురించి స్మరించుకోవడం శుభపరిణామమన్నారు. ఆయన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని వివరించారు. సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా వేమన పద్య రచనలు సాగాయని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి వేమన పద్యాలు ఎంతగానో దోహదపడుతాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, ఇన్‌చార్జి సీపీవో భారతి, ఇన్‌చార్జి సెట్కూరు సీఈవో దీప్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 11:35 PM