మైనార్టీల సంక్షేమానికి కృషి
ABN, Publish Date - Jan 30 , 2025 | 11:39 PM
మైనార్టీల సంక్షేమాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, జనవరి 30(ఆంఽధ్రజ్యోతి): మైనార్టీల సంక్షేమాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీప్, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ, షరీఫ్ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మైనార్టీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా షాదిఖానాలు నిర్మించిన ఘనత టీడీపీదే అన్నారు.
Updated Date - Jan 30 , 2025 | 11:39 PM