ఐదేళ్లలో 20 లక్షల ఉపాధి, ఉద్యోగాలు
ABN, Publish Date - Feb 02 , 2025 | 11:24 PM
‘‘వైసీపీ హయాంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వామ్మో.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబ డులా? అంటూ పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో పెట్టుబడిదా రులకు మళ్లీ భరోసా కలిగింది. వివిధ సంస్థలు వస్తున్నాయి’ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
చంద్రబాబు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచారు
దావోస్‌లో ఆయన కష్టం స్పష్టంగా కనిపించింది
ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు సమావేశాలే
జగన్ హయాంలో రాష్ట్రం విధ్వంసం: మంత్రి భరత్
కర్నూలు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ హయాంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వామ్మో.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబ డులా? అంటూ పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో పెట్టుబడిదా రులకు మళ్లీ భరోసా కలిగింది. వివిధ సంస్థలు వస్తున్నాయి’ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉపాధి, ఉద్యోగాల కల్పన తథ్యమని చెప్పారు. ‘‘ఏడు నెలల్లో రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వాటి ద్వారా 4.10 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) యూనిట్ల ఏర్పాటుకు రియల్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 2.55 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు రానున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయయి. ఒకనాటి రాళ్లసీమ నేడు గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారబోతుంది’’ అని మంత్రి వివరించారు. ఐదేళ్లలో రాయలసీమ జిల్లాలకు మరిన్ని కంపెనీలు వస్తాయన్నారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది
వైసీపీ హయాంలో జగన్ సాగించిన అరాచకం, విధ్వంసం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని మంత్రి భరత్ చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో వారిలో మళ్లీ భరోసా కలిగిందన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజీ పెరిగిందని, దావోస్ పర్యటనలో అది స్పష్టంగా కనపించిందని తెలిపారు. దావోస్‌లో ఎముకలు కొరికే చలి ఉన్నా.. సీఎం చంద్రబాబు సాధారణ దుస్తుల్లోనే గడపడం ఆయనకే సాధ్యమైందన్నారు. ‘‘అక్కడున్న ఐదు రోజులు ప్రతిక్షణం ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సీఎం చంద్రబాబు కష్టపడ్డారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కంపెనీల ప్రతినిధులతో వందకు పైగా రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు, పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించారు’’ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారని, అక్కడ ఏర్పాటు చేసిన హైటెక్ సిటీ తరహాలో ప్రస్తుతం విశాఖలోని మధురవాడ వద్ద డేటా సిటీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికే గూగుల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామన్నారు. విశాఖ ఐటీ సిటీగా భారతపటంలో ప్రముఖ స్థానంలో నిలవబోతుంద న్నారు. అమ్మకు, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి(జగన్) ఐదు కోట్ల ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఘాటుగా స్పందించారు. ‘‘వైసీపీ నాయకులు నిరసనల పేరిట ప్రజల్లోకి వస్తున్నామని అంటున్నారు. ఏ మోహం పెట్టుకొని వస్తారు’’ అని మంత్రి భరత్ ప్రశ్నించారు.
వచ్చే ప్రాజెక్టులు ఇవీ..
కర్నూలులో ఏపీ జెన్కో, ఎన్‌హెచ్‌టీసీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి.
అనంతపురం, కడపల్లో ఎస్‌ఏఈఎల్ సోలార్ ఎంహెచ్‌పీ-1 రూ.1,728 కోట్లతో ప్రాజెక్టు పెట్టనుంది.
అనంతపురం జిల్లాలో టాటా పవర్ రూ.2 వేల కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేయనుంది.
కడప, నంద్యాల జిల్లాల్లో ఎస్‌ఏఈఎల్ సోలార్ ఎంహెచ్‌పీ-2 రూ.1,728 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది.
ఎకోరెడ్ ఎనర్జీ ఇండియా కర్నూలు జిల్లాలో రూ.4,435 కోట్లతో, కర్నూలు, నంద్యాల జిల్లాలో రూ.3,142 కోట్లు, అనంతపురం, కడప జిల్లాల్లో రెండు యూనిట్లలో రూ.794 కోట్లు, కడప, నంద్యాల జిల్లాల్లో ‘క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ’ హైబ్రిడ్-3 రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో టాటా పవర్ ఎనర్జీ కర్నూలు జిల్లాలో రూ.2 వేల కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేయనుంది.
గ్రీన్‌కో రూ.16,500 కోట్లతో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది.
Updated Date - Feb 02 , 2025 | 11:24 PM