ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి

ABN, Publish Date - Mar 06 , 2025 | 11:28 PM

జిల్లాలోని రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని కలెక్టర్‌ రాజకుమారి పిలుపునిచ్చారు.

రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని కలెక్టర్‌ రాజకుమారి పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో రైతు సాధికారిక సంస్థ - ప్రజా భాగస్వామ్యం ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులవల్ల భూమి సారం పోవడమే కాకుండా మానవుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. జిల్లాలోని 1633 అంగన్‌వాడీ కేంద్రాలు, 86 సంక్షేమ వసతిగృహాల ఆవరణలో ఆకుకూరలు పెంచి ఆహారపదార్థాల్లో వినియోగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు, జిల్లా పట్టుపరిశ్రమల అధికారి పరమేశ్వరి, కేవీకే సైంటిస్ట్‌ బాలరాజు, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారత లక్ష్యాలపై దృష్టి సారించండి

మహిళా సాధికారతకు నిర్దేశించిన లక్ష్యాలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ ద్వారా అమలయ్యే కార్యక్రమాల ప్రగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో అమలవుతున్న అన్ని పారామీటర్ల సంక్షేమ పథకాల లక్ష్యసాధనలో దృష్టి పెట్టాలని ఏపీఎం, సీసీలను ఆమె ఆదేశించారు.

Updated Date - Mar 06 , 2025 | 11:29 PM