ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆకాశాన్నంటుతున్న వాము

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:28 AM

కర్నూలు మార్కెట్‌ యార్డులో వాము ధర రోజురోజుకూ పెరుగుతోంది. వారం క్రితం క్వింటం వాము గరిష్ఠంగా రూ.23,011 ఉండగా.. శుక్రవారం రూ. 26,012కు చేరింది.

కర్నూలు మార్కెట్‌ యార్డుకు విక్రయానికి తెచ్చిన వాము

క్వింటం గరిష్ఠ ధర రూ.26,012

రైతులు హర్షం

కర్నూలు అగ్రికల్చర్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డులో వాము ధర రోజురోజుకూ పెరుగుతోంది. వారం క్రితం క్వింటం వాము గరిష్ఠంగా రూ.23,011 ఉండగా.. శుక్రవారం రూ. 26,012కు చేరింది. ఈ ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు తెలిపారు. కర్ణాటక, అనంతపురం ప్రాంతాల నుంచి రైతులు వామును కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకువస్తున్నారు. క్వింటం వాము ధర గరిష్ఠంగా రూ.26,012, మధ్యస్థ ధర రూ.11,099, కనిష్ఠ ధర రూ.1,499కు అమ్ముడుపోయింది. వేరుశనగ కాయల ధర మాత్రం రోజురోజుకు పతనం అవుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం క్వింటం వేరుశనగ కాయలకు మద్దతు ధర రూ.6,720 ప్రకటించింది. శుక్రవారం క్వింటం వేరుశనగకాయల ధర కర్నూలు యార్డులో రూ.6,011కు తగ్గిపోవడంతో రైతులు ఆయిల్‌ఫెడ్‌ ద్వారా కొని మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:28 AM