ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజిలెన్స విస్తృత తనిఖీలు

ABN, Publish Date - Feb 07 , 2025 | 12:42 AM

నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతంలో ఉన్న పాల కేంద్రాలపై విజిలెన్స అధికారులు విస్తృత తనిఖీలు చేశారు.

విజిలెన్స విస్తృత తనిఖీలు

పాల కేంద్రాల్లో సోదాలు

కర్నూలు క్రైం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతంలో ఉన్న పాల కేంద్రాలపై విజిలెన్స అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. విజిలెన్స ఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు సీఐ పవన కిషోర్‌, యుగంధర్‌బాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేశారు. నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతంలో ఉన్న ఓ షాపులో విడిగా పాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే ప్రముఖ కంపెనీల నేయి ప్యాకెట్లలో సాధారణ నేయి కలిపి కల్తీ చేసి విక్రయిస్తున్నట్లగా విజిలెన్స అధికారుల విచారణలో తేలింది. అలాగే భూపాల్‌నగర్‌, నంద నపల్లి సమీపంలో ఉన్న ఎల్‌వీరెడ్డి డెయిరీ ఫాంలో తనిఖీలు చేశారు. పాల ప్యాకెట్లుపై తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ ఉండక పోవడం గుర్తించారు. అలాగే పాల షాంపిల్స్‌ సేకరించి హైదాబాదులోని ల్యాబ్‌కు పంపించారు.

ఫ టీవీ-9 ప్రజానగర్‌ కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన బియ్యాన్ని విజిలెన్స అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. బాలశివుడు అనే వ్యక్తి 28 క్వింటాళ్ల రేషన బియ్యాన్ని అక్ర మంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన బియ్యాన్ని పౌరసరపరా శాఖల అధికారులకు అప్పగించారు. బాల శివుడుపై తాలుకా పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశారు.

Updated Date - Feb 07 , 2025 | 12:42 AM