ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధ్రువీకరణ పత్రాల్లో జాప్యం తగదు: కలెక్టర్‌

ABN, Publish Date - Mar 05 , 2025 | 12:00 AM

జనన-మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా అందజేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జనన-మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా అందజేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో జనన-మరణాల ధ్రువీకరణ పత్రాల జారీపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన 21రోజుల వ్యవధిలోపు ప్రసవం అయిన ఆస్పత్రిలోనే వైద్యాధికారి నుంచి పుట్టినతేది ధ్రువీకరణ పత్రాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలతో హోం డెలివరీలు, రిజిస్ట్రేషన్‌ నమోదులపై సమగ్ర సర్వే చేపట్టాలని డీపీవోను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఒ డాక్టర్‌ వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జఫ్రుల్లా, మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, డీపీవో షేక్‌ జమీవుల్లా, గణాంక అధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:00 AM