జీవోను విడుదల చేయాలి
ABN, Publish Date - Feb 24 , 2025 | 12:46 AM
సివిల్ సప్లయ్ హామాలీలకు సంబంధించిన కొత్త కూలి రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని హామాలీలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.
హమాలీల అర్ధనగ్న ప్రదర్శన
గూడూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సివిల్ సప్లయ్ హామాలీలకు సంబంధించిన కొత్త కూలి రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని హామాలీలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఆదివారం గూడూరు పట్టణంలోని సివిల్ సప్లయ్ గోడౌన పక్కన హామాలీ యూనియన నాయకులు వెంకటేశ్వర్లు, క్రిష్ణ అధ్యక్షతన మూడో రోజు హామాలీలు అర్దనగ్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐ టీయూ డివిజన కార్యదర్శి జేమోహన మాట్లాడతూ హమాలీల కూలి రేట్లు జీవోను విడుదల చేయకుండా ప్రభుత్వం కార్మికుల కడుపు కొడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, మధు, రామాంజనేయులు, చిన్నరాజు, పాల్గొన్నారు.
Updated Date - Feb 24 , 2025 | 12:46 AM