ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా గంజహళ్లి ఉరుసు

ABN, Publish Date - Mar 07 , 2025 | 12:13 AM

మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో వెలసిన మహాత్మ బడేసాహెబ్‌ ఉరుసు గురువారం వైభవం గా నిర్వహించారు.

స్వామివారి గంధం తీసుకెళ్తున్న పీఠాధిపతులు

గోనెగండ్ల, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని గంజహళ్లి గ్రామంలో వెలసిన మహాత్మ బడేసాహెబ్‌ ఉరుసు గురువారం వైభవం గా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి పీఠాధిపతులు గంధం తీసుకువెళ్లిన తరువాత ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉరుసు సందర్భంగా ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దాదాపు రెండు లక్షల మందికి పైగానే ఉరుసు కార్యక్రమానికి భక్తులు హాజరయ్యారని నిర్వాహకులు తెలుపుతున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహిళలకు, పురుషుల కు ప్రత్యేక క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. ఉరుసులో మహిళలను, పిల్లలను, మట్టిగాజులు, బొమ్మల అంగళ్లు ఆకట్టుకున్నాయి. స్వామివారి దర్శనం అనంతరం అంగళ్ల దగ్గరే మహిళలు పెద్ద ఎత్తున గుమి గూడి గాజులను, బొమ్మలను కొనుగోలు చేశారు. గోనెగండ్ల సీఐ గంగాధర్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ముగ్గురు సీఐలు, తొమ్మిది మంది ఎస్‌ఐలు దాదాపు 160 మంది పోలీసులు విధులు నిర్వహించారు.

Updated Date - Mar 07 , 2025 | 12:13 AM