ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు పదో తరగతి కీలకం

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:16 PM

విద్యార్థులకు పదో తరగతి కీలకమని ఉత్తమ ఫలితాలు సాధించేం దుకు కృషి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా సూచిం చారు. శనివారం పత్తికొండ బాలికల గురుకుల, కస్తూర్భా పాఠశాలలను ఎమ్మెల్యే శ్యాంబాబు, ఎమ్మెల్సీ బీటీ నాయుడితో కలసి పరిశీలించారు.

కస్తూర్బాలో విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

పత్తికొండ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు పదో తరగతి కీలకమని ఉత్తమ ఫలితాలు సాధించేం దుకు కృషి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా సూచిం చారు. శనివారం పత్తికొండ బాలికల గురుకుల, కస్తూర్భా పాఠశాలలను ఎమ్మెల్యే శ్యాంబాబు, ఎమ్మెల్సీ బీటీ నాయుడితో కలసి పరిశీలించారు. పాఠాలు అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకోవాలని. యూట్యూ బ్‌లో కూడా తెలయని అంశాలు నేర్చుకోవచ్చన్నారు. వర్చువల్‌ తరగతుల ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సైన్న్‌, మ్యాఽథ్స్‌ సిలబస్‌ ఎంతమే రకు పూర్తయిందని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్యాంబాబు మట్లాడుతూ పదో తరగతిలో 90శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. అనంతరం వంటగది, ఆహారాన్ని పరిశీలించారు. కస్తూర్భా పాఠ శాలకు నూతనంగా మంజూరైన జూనియర్‌ కళాశాల కోసం స్థలాన్ని సేకరించాలని ఆర్డీవోకు సూచిం చారు. అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ప్రిన్సిపాళ్లు సుబ్బలక్ష్మమ్మ, షభానా ఉన్నారు.

పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్‌

దేవనకొండ: మండలంలోని కరివేముల గ్రామంలో కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. కిడ్నీ బాధితులు గుఱ్ఱం కిరణ్‌, గిరిధర్‌, దివ్యాంగుడు రాజగోపాల్‌, వృధ్యాప్య పించన్‌ రంగన్న ఇళ వద్దకు వెళ్లి వారి యోగక్షేమలు అడిగి పింఛన్లు పంపీణి చేశారు. గ్రామంలో నీటి సమస్య ఉందని, ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మించాలని, సచివాలయం భవనం, పాఠశాల భవనాలను పూర్తి చేయాలని, చెరువు కట్టపై కంపను తొలగించి, కాలువ నిర్మించాలని గ్రామస్థులు కోరారు. డీఆర్‌డీవో శివనాగలీల, పత్తికొండ ఆర్డీవో భరత్‌నాయక్‌, డీటీ సుదర్శనం, ఎంపీడీవో సూర్యనారాయణ, గ్రాస్తులు గిడ్డయ్య, వన్నూరప్ప, అబ్య రంగన్న పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 11:16 PM