ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

ABN, Publish Date - Mar 08 , 2025 | 10:59 PM

లోక్‌ అదాలత్‌తో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి, లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వాసు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాధారాణి, ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ లక్ష్మి అన్నారు.

లోక్‌ అదాలత్‌లో కేసులను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాధారాణి

1021 కేసులు పరిష్కరించిన న్యాయాధికారులు

నంద్యాల క్రైం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): లోక్‌ అదాలత్‌తో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని మూడో అదనపు జిల్లా న్యాయాధికారి, లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వాసు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాధారాణి, ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ లక్ష్మి అన్నారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నంద్యాలలోని జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఎస్‌టీసీ కేసులు 694, సీసీ కేసులు 66, సివిల్‌ కేసులు 27, ఎంసీ 2, డీవీసీ 2, ఎన్‌ఐయాక్ట్‌ 16, ఎక్సైజ్‌ 101, ఎంవీఓపీ 39, అడ్మిషన్‌ కేసులు 74, ఈపీ 15 కేసులు చొప్పున మొత్తం 1021 కేసులు పరిష్కరించినట్లు వారు తెలిపారు. ఆయా కేసుల్లోని కక్షిదారులకు రూ.3.76 కోట్ల పరిహారం అందించామన్నారు. చిన్న చిన్న సమస్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా లోక్‌అదాలత్‌కు వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతుందని సూచించారు. క్షమాపణతో ఎంత పెద్ద గొడవైనా సద్దుమణుగుతుందన్నారు. రాజీ కాగల కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు, పోలీసులు ఎంతో కృషిచేస్తున్నారన్నారు. కుటుంబ కలహాల వల్ల భార్యాభర్తలు కోర్టును ఆశ్రయిస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని, రాజీయే రాజమార్గమని కక్షిదారులు తెలుసుకోవాలని న్యాయాధికారులు సూచించారు. కార్యక్రమంలో ఏజీపీ జగన్మోహన్‌రెడ్డి, వివేకానందరెడ్డి, పీపీ శ్రీనివాసులు, రావినూతల దుర్గాప్రసాద్‌, విజయశేఖర్‌రెడ్డి, భూపని వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, ఫణీంద్రనాథ్‌, ద్వారకానాథ్‌, చంద్రశేఖర్‌, ఓబుల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, లోక్‌ అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 10:59 PM