బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి: డీఎంహెచవో
ABN, Publish Date - Jan 29 , 2025 | 01:16 AM
జిల్లాలో బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచవో డాక్టర్ పి.శాంతి కళ వైద్యాధికారులను ఆదేశించారు.
కర్నూలు హాస్పిటల్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచవో డాక్టర్ పి.శాంతి కళ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం డీఎం హెచవో కల్లూరు పీహెచసీని తనిఖీ చేశారు. అనంతరం ఎంఎ ల్‌హెచపీ, ఆరోగ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బాల్య వివాహాలు జరగ కుండా అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బా యిలకు 21 సంవ త్సరాలు పూర్తయిన తర్వాత వివాహాలు జరిపించా లన్నారు. జాతీయ ఆరోగ్యకార్యక్రమాల ప్రగతి వంద శాతం తక్కువగా కాకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. మూడేళ్లు తాత్కాలికంగా కుటుంబ నియం త్రణ పద్ధతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి నూకరాజు, పీహెచసీ వైద్యాధికారి మోతీలాల్ నాయక్, ఏఎన ఎం, ఎంఎల్‌హెచవో పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2025 | 01:16 AM