ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాఘవరాయలకు విశేష పుష్పాలంకరణ

ABN, Publish Date - Feb 14 , 2025 | 12:27 AM

వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణతో పాటు విశేష పుష్పాంకరణ సేవ చేశారు.

వెండి గజవాహనంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

వెండి గజ వాహనంపై విహరించిన ప్రహ్లాదరాయలు

భక్తులతో కిక్కిరిసిన శ్రీమఠం

మంత్రాలయం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణతో పాటు విశేష పుష్పాంకరణ సేవ చేశారు. రాఘవేంద్రస్వామి సజీవ సమాదిపొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేం ద్రతీర్థులు ఆధ్వర్యంలో మఠం పండితులు బృందావనానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం, క్షీరాభిషేకం, తులసి అర్చన, విశేష పంచామృతాభిషే కం నిర్వహించారు. బంగారు, వెండి, పట్టువసా్త్రలు, బెంగళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలు, బంగారు కవచంతో చూడ ముచ్చటగా అలంకరించారు. పీఠాధిపతి సంస్థాన పూజ చేశారు. హస్తోదకం చేసి మహా మంగళ హారతులు చేశారు. రాఘవరాయలకు ఇష్టమైన మాఘ మాస గురువారం కావటంతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వే లాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగాణం భక్తులతో కిక్కిరిసింది.

ఫ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లదరాయలు వెండి గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. మాఘ పాడ్యమి గురువారం శుభదినం పురస్కరించుకుని శ్రీ మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి, మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వెండి గజవాహనంపై స్వర్ణ అంబారిలో వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతి మహామంగళహా రతితో ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు.

Updated Date - Feb 14 , 2025 | 12:28 AM