ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సైన్స్‌ మన జీవితంలో భాగం

ABN, Publish Date - Mar 01 , 2025 | 12:40 AM

సైన్స్‌ మన జీవితంలో భాగమని విశ్రాంత సైన్స్‌ ఉపాధ్యాయుడు, జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత రామయ్య అన్నారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల్లో శుక్రవారం జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు.

దేవనకొండ : తెర్నేకల్లు జడ్పీ పాఠశాలలో

ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో జాతీయ సైన్స్‌డే

నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులు

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సైన్స్‌ మన జీవితంలో భాగమని విశ్రాంత సైన్స్‌ ఉపాధ్యాయుడు, జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత రామయ్య అన్నారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల్లో శుక్రవారం జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలలో సీవీ రామన్‌ చిత్రపటానికి ఉపాధ్యాయులు నివాళి అర్పించారు. రామయ్య మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం లేకుండా జీవితాన్ని ఊహించలేమన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్త లుగా ఎదగాలని సూచించారు. అనంతరం విద్యా ర్థులు వివిధ అంశాలపై ఏర్పాటు చేసిన సైన్స్‌ ప్రదర్శనను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు ప్రహల్లాద, శ్యామలా, సువేదా రేణుక, రాధా, ఆనంద్‌ బసవరాజు, రాముడు పాల్గొన్నారు.

ఆర్‌ఆర్‌లేబర్‌ కాలనీ పురపాలక పాఠశాలలో

హెచ్‌ఎం రమేష్‌ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. మానవ శరీర నిర్మాణం, గ్లోబల్‌ వార్మింగ్‌, జీవన ఎరువులు, పలు అంశాలపై విద్యార్థులు వివరించారు.

మిల్టన్‌ గ్రామర్‌ పాఠశాలలో.

కరస్పాండెంట్‌ హెచ్‌ రమేష్‌ బాబు ప్రిన్సిపాల్‌ నాగరాజు ఆధ్వర్యంలో సైన్స్‌ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

నేషనల్‌ విద్యాసంస్థల్లో

నేషనల్‌, జీఎస్‌ఆర్‌ పాఠశాలలో కరస్పాండెంట్‌ గోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో సైన్స్‌ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు సైన్స్‌ ప్రదర్శన ఏర్పాటు చేశారు. సైన్స్‌ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ఆర్ట్స్‌ కళాశాలలో

వృక్ష శాస్త్ర విభాగంలో బీఎస్సీ బోటనీ విద్యార్థులు జీవ నత్రజని స్థాపన, బయోఫియల్‌, హైడ్రోపోనిక్‌, బీటీ పత్తి, ఆగ్రో బ్యాక్టీరియా, బయోలిప్స్టిక్‌, జన్యుమార్పిడి, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి అంశాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళాశాల చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కరస్పాండెంట్‌ దైవాదినం రెడ్డి, ప్రిన్సిపాల్‌ మురళీమోహన్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల్లో పరిజ్ఞానం

మద్దికెర: విద్యార్థుల్లో పరిజ్ఞానం దాగి ఉందని ఎంఈవో రంగస్వామి, విద్యాసాయి కళాశాల ఎండీ వెంకటమాధవ్‌ అన్నారు. శుక్రవారం మద్దికెర, ఎం.అగ్రహారం గ్రామాల్లోని పాఠశాల్లో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు రూపొం దించిన నమూనాలను పరిశీలించారు. ఉపాధ్యా యులు విద్యార్థులకు సైన్స్‌ పట్ల భయాన్ని పోగొట్టాల న్నారు. ప్రిన్సిపాల్‌ ఎర్రవలి రామాంజనేయులు, బాల సునీత తదితరులు పాల్గొన్నారు.

దేవనకొండ: సైన్స్‌తోనే మన మనుగడ ఆధారపడి ఉందని తెర్నేకల్‌ జడ్పీ పాఠశాల హెచ్‌ఎం కృష్ణమూర్తి అన్నారు. విద్యార్దులు నమూనాలు తయారుచేసి ప్రదర్శించారు. విశ్వంలోని పరిణామాలు, మానవుల మనుగడపై విద్యార్థులు వివరించారు. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, మధుబాబు, అనిల్‌, ఉస్మాన్‌, నబీరసూల్‌ పాల్గొన్నారు.

ఘనంగా సైన్స్‌డే.

పత్తికొండ: పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో సైన్స్‌డేను శుక్రవారం ఘణంగా జరుపుకున్నారు. హెచ్‌ఎం మాలతి సీవీ రామన్‌ చిత్రపానికి నివాళి అర్పించారు.

Updated Date - Mar 01 , 2025 | 12:40 AM