ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పులు లేకుండా రీసర్వే చేయండి: సబ్‌ కలెక్టర్‌

ABN, Publish Date - Mar 06 , 2025 | 01:02 AM

తప్పులు లేకుండా రీ సర్వే చేయాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు.

రీ సర్వే వివరాలను పరిశీలిస్తున్న ఆదోని సబ్‌ కలెక్టర్‌

కౌతాళం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): తప్పులు లేకుండా రీ సర్వే చేయాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. బుధవా రం గుడికంబాలి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేలో కౌతాళం మండలంలో గుడికంబాలి గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. గ్రామంలో ఏరైతుకు ఎలాంటి నష్టం జరగకుండా పక డ్బందీగా రీసర్వేను చేపట్టాలని మండల రెవెన్యూ అధికారులను ఆదే శించారు. ఇప్పటి వరకు చేపట్టిన రీసర్వే వివరాలను మండల తహసీ ల్దార్‌ రజినీకాంత రెడ్డిని అడిగి తెలుసుకుని డివిజనల్‌ సర్వేయర్‌ వేణు సూర్యతో కలిసి రీసర్వే రికార్డులను పరిశీలించారు. గ్రామంలోని మొత్తం భూమిని సెక్టర్లుగా విభజించి పూర్తిగా చేస్తామన్నారు. వీరి వెంట తహసీల్దార్‌ రజినీకాంత రెడ్డి వీఆర్వో నాగార్జున, సర్వేయర్లు ఉన్నారు.

ఇసుక రీచను తనిఖీ చేసిన సబ్‌ కలెక్టర్‌: ప్రభుత్వం ఆర్హులైన లబ్ధిదారులకు నిబంధనల మేరకు ఇసుకను సరఫరా చేస్తుందని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని గుడికంబాలి ఇసుక రీచను తనిఖీ చేశారు. రీచలలో ఉన్న ఇసుక రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నిబంధనల మేరకు రీచల వద్ద ఇసుకను సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Updated Date - Mar 06 , 2025 | 01:02 AM