నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించండి
ABN, Publish Date - Mar 04 , 2025 | 12:28 AM
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పీజీఆర్‌ఎస్ లాగిన్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని అదే విధంగా రీఓపెన్ అయిన అర్జీలపై కూడా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కలెక్టరేట్‌లో ఉన్న ఆయా కార్యాలయాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాల కిటికీల్లో నుంచి ఖాళీ వాటర్ బాటిల్స్, టీకప్పులు, బయటికి పడేసి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నెల 3 వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతా దివస్ కార్యక్రమాలను నిర్వహించుకుని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటే కలెక్టరేట్‌ను శుబ్రంగా ఉంచుకోకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకటనారాయణమ్మ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Mar 04 , 2025 | 12:29 AM