ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటు నమోదు చేసుకోండి

ABN, Publish Date - Jan 25 , 2025 | 11:41 PM

అర్హత కలిగిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డా. బి. నవ్య అన్నారు.

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య

అర్హత గల యువత ముందుకు రావాలి

జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి.నవ్య

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డా. బి. నవ్య అన్నారు. శనివారం పట్టణంలోని సునయన ఆడిటోరియంలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ 2011 జనవరి 25న మొదటిసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని క్యాబినె ట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రతిపాదించారని గుర్తు చేశారు. త్వరలోనే దేశంలో ఒక బిలియన్‌ ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఓటు నమోదు 65 శాతం ఉందని, రాష్ట్రంలో 80 శాతం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు న మోదు కావాలన్నారు. అనంతరం వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అదేవిధంగా సీనియర్‌ సిటిజన్స్‌, విభిన్న ప్రతిభావంతుల ఓటర్లను శాలు వ, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చిరంజీవి, డీఆర్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, ఉపాధి కల్పన అధికారి దీప్తి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ మురళి, జి. పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్‌ కళాశాల, సీఎస్‌సీ కాలేజీ ఆప్‌ ఫార్మసీ, ఎస్టీబీసీ ఉస్మానియా డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:41 PM