ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వారు కొన్నారు, వీరు తిరస్కరించారు

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:14 PM

కంది దిగుబడిని మార్క్‌ఫెడ్‌ అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేయడంతో ఇంకేముంది అని రైతులు సంతోషించారు.

వేర్‌ హౌస్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతులుసెంట్రల్‌ వేర్‌ హౌస్‌ వద్ద నిలిచిన కంది లారీలు

మద్దతు ధరకు కందులు కొన్న మార్క్‌ఫెడ్‌

నాణ్యంగా లేవని తిరస్కరించిన సీడబ్ల్యూసీ మేనేజర్‌ నాలుగురోజులుగా లారీల్లోనే కందులు

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కంది దిగుబడిని మార్క్‌ఫెడ్‌ అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేయడంతో ఇంకేముంది అని రైతులు సంతోషించారు. అంతలోనే డ్యామేజీ ఉందని సీడబ్ల్యూసీ మేనేజర్‌ శ్రీనిధి సరుకు తీసుకునేందుకు తిరస్కరించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. నాలుగు రోజులుగా లారీల్లోనే కంది దిగుబడులు ఉండటంతో రైతుల అవస్థలు వర్ణనాతీతం.

ఆదోని, ఆస్పరి, ఆలూరు మండలాల గ్రామాలకు చెందిన 300 మంది రైతులకు సంబంధించి 11 లారీల (350 టన్నుల) కందిని శనివారం గోడౌన్‌లోకి దించకుండా నిలిపేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆరుగాళం శ్రమించి కందిని కాపాడుకుంటే నిబంధనల పేరుతో తిరస్కరించడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. జల్లెడతో తూర్పార పట్టి గ్రేడింగ్‌ చేసినప్పటికీ తిరస్కరించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతుల దగ్గరకే వెళ్లి డీసీఎంఎస్‌ మేనేజర్‌ ప్రకాష్‌ రెడ్డి కందిని సేకరించారు. అయితే తూకపు ఖర్చు, హమాలీ చార్జీలు, లారీ బాడుగను సెంట్రల్‌ వేరౌస్‌ వద్దకు వచ్చేవరకు రైతులే భరించాల్సి ఉంటుంది. దీంతో నాలుగు రోజులు లారీల బాడుగలు భరించామని, ఇప్పుడు వెనక్కి తీసుకెళ్లానడటం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బసాపురం, దాణాపురం, మదిరే, జోహారాపురం, రామదుర్గం విరుపా పురం భేవినహాళ్లు తదితర గ్రామాలకు చెందిన రైతులు కంది దిగుబడులు తీసుకోకుంటే ఇక్కడే రోడ్డుపై పాడేస్తామని హెచ్చరించారు. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ సెంట్రల్‌ వేర్‌హౌస్‌ మేనేజర్‌ శ్రీనిధితో మాట్లాడి రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని, సరుకు తీసుకోవాలని కోరారు. ఆమె నిబంధనలు పాటించాలనడంతో సబ్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌కు ఫిర్యాదు చేశారు.

నిబంధనలను సవరించాలి

గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.7550 దొరుకు తుందని ఆశించాము, గోడౌన్‌ మేనేజర్‌ నిబంఽ దనల పేరుతో తిరస్కరిస్తున్నారు. నిబంధనలు సవరించాలి - సుధాకర్‌, కంది రైతు బసాపురం

నిబంధనల మేరకే

ప్రభుత్వ నిబంధనల మేరకే సెంట్రల్‌ వేర్‌ హౌస్‌ గోడౌన్‌లో నిల్వ ఉంచుతాం. డ్యామేజీ ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేయలేదు అక్కడే పూర్తిగా పరిశీలించి తీసుకురావాలి. - శ్రీనిధి, వేర్‌హౌన్‌ మేనేజర్‌

Updated Date - Feb 01 , 2025 | 11:14 PM