వాటర్ గ్రిడ్‌కు రూ.290 కోట్లతో ప్రతిపాదనలు: ఎమ్మెల్యే
ABN, Publish Date - Feb 22 , 2025 | 12:31 AM
నియోజయవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు గాను వాటర్ గ్రిడ్ పనులు చేపట్టేందుకు గాను రూ. 290 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వాన్ని పంపామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు.
గోనెగండ్ల, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): నియోజయవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చేసేందుకు గాను వాటర్ గ్రిడ్ పనులు చేపట్టేందుకు గాను రూ. 290 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వాన్ని పంపామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. గోనెగండ్లలో జలజీవన మిషన పనుల కింద ఓహెచఆర్ ట్యాంక్, పైప్‌లైన పనులకు గాను రూ. 2.50 కోట్లు విడుదల కావడంతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. అలాగే బీసీ కాలనీలో వేసిన రోడ్డు లను ఆయన ప్రారంభించారు. బీవీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని అందుకు గాను రూ. 290 కోట్లు తో ప్రతిపాధనలు తయారు చేశామన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లించి గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. గోనెగండ్లలో శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గాను జలజీవన మిషన ద్వారా మూడు ఓహెచఆర్ ట్యాంక్‌లతో పాటు గ్రామంలోకి కొత్త పైప్‌లైన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి ఉచితంగా కొళాయిని ఇస్తామన్నారు. గ్రామంలో దాదాపు 1700 కొళాయిలు కొత్తగా కనెక్షన చేస్తామని తెలిపారు. దీంతో గ్రామంలో నెలకొన్న తాగేనీటి సమస్య తీరుతుందన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ విధ్యాసాగర్, పీఆర్‌డీఈ చంద్రశేఖర్, పీఆర్‌ఏఈ శివశంకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీడీవో మణిమంజరి, సీఐ గంగాధర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Feb 22 , 2025 | 12:31 AM