ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:44 AM

రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై ఊరేగారు.

స్వర్ణ రథంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై ఊరేగారు. శనివారం ధనుర్మాసం ద్వాదశి శుభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బృందావనానికి క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం చేసి వెండి, బంగారు, పట్టు వస్ర్తాలతో శోభాయమానంగా అలంకరించారు. పూర్ణబోధ పూజ మందిరంలో మూలరాములకు , జయరాములు, దిగ్విజయరాములకు కనకాభిషేకం చేశారు. స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలను ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు.

మంత్రాలయంలో భక్తుల రద్దీ : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో సందడి గా మారింది. రెండో శని, ఆదివారం సెలవు దినాలు కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగ ణం భక్తులతో కిక్కిరిసింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Jan 12 , 2025 | 12:44 AM