ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అడ్డగోలుగా పైపులైన్‌..!

ABN, Publish Date - Mar 08 , 2025 | 11:05 PM

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు నీరు అందించేందుకు వేస్తున్న పైపులైన్‌ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి.

కొణిదేల గ్రామంలో నడి రోడ్డుపై పైపులైన్‌ కోసం గుంత తవ్వుతున్న దృశ్యం

ఓర్వకల్లు పరిశ్రమల కోసం నడి రోడ్డును తవ్వుతున్న వైనం

ముచ్చుమర్రి నుంచి ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారి వెంట పైపులైన్‌ ఏర్పాటు

భారీ వాహనాలతో ప్రజా రవాణాకు ఇబ్బందిగా పనులు

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు నీరు అందించేందుకు వేస్తున్న పైపులైన్‌ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ రోడ్డుకు కుడి వైపున పైపులైన్‌ తీసుకెళ్లేందుకు అనుమతులు ఉండగా... కొన్ని గ్రామాల్లో నడి రోడ్డును తవ్వుతూ పైపులైన్‌ పనులు సాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొన్ని గ్రామాల్లో తాగునీటి పైపులైన్‌లను తొలగిస్తూ పైపులైన్‌ వేశాక మళ్లీ వేస్తామంటూ చెప్పి వారి పని పూర్తి కాగానే గ్రామానికి మంచినీటిని అందించే పైపులైన్‌ పనులను గాలికి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నందికొట్కూరు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు వద్ద పరిశ్రమల హబ్‌ ఏర్పాటుకు 10 వేల ఎకరాలను కేటాయించారు. ఓర్వకల్లు మండలం గుట్టపాడు పొలిమేరలో జయరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం 2,500 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశ్రమలకు నీటి సౌకర్యం కోసం ముచ్చుమర్రి నుంచి పైపు లైన్‌ ద్వారా నీరు తీసుకెళ్లేందుకు పనులు సాగుతున్నాయి. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జలాలను ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు ఆర్‌ అండ్‌బీ రోడ్డు పక్కన పైప్‌లైన్‌ తీసుకువెళ్లేందుకు పనులు సంవత్సరనర్న కాలంగా కొనసాగుతున్నాయి. ఏడు అడుగుల లోతు, 1.8 మీటర్ల వెడల్పు పొడవున ఈ కాలువను తీస్తున్నారు. ఈ పైపు లైన్‌ మొత్తం 56 కి.మీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. ఈ పైపు లైన్‌ కోసం రూ.288 కోట్లతో పనులు ప్రారంభించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి దిగువకు 300 మీటర్లలో పంపు హౌస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన పైపు లైన్‌ పనులు 2023 జూన్‌ నెల నుంచి పనులు ప్రారంభం అయ్యాయి. అయితే ఇంత వరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ వద్ద మాత్రం పనులు ప్రారంభం కాలేదు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ కెనాల్‌ పైభాగం నుంచి పైప్‌లైన్‌ను తీసుకొని ముచ్చుమర్రి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు కుడి వైపు నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లు వరకు 56 కి.మీటర్ల మేర భూమి లోపల ఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు పక్రియ కొన్ని గ్రామాలు మినహా రోడ్డు వెంట పూర్తి చేశారు. ముచ్చుమర్రి, కొణిదేల, నాగటూరు, నందికొట్కూరు, బొల్లవరం, బ్రాహ్మణకొట్కూరు, గార్గేయపురం మీదుగా అర్‌అండ్‌బీ రోడ్డు, కేజీ రోడ్డు వెంట పైపు లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుంచి కేతవరం, పూడిచర్ల మీదుగా గుట్టపాడు పొలిమేరలో నిర్మిస్తున్న జయరాజ్‌ ఇస్పాత్‌(ఉక్కు పరిశ్రమ) వరకు ఈ పైప్‌ లైన్‌ను తీసుకు పోనున్నారు. అయితే ముచ్చు మర్రి, నందికొట్కూరు మినహా అన్ని గ్రామాల్లో దాదాపు పైప్‌లైన్‌ పనులు దాదాపు పూర్తి ముగిసాయి. అయితే గ్రామాల్లో చేపట్టిన పైపు లైన్‌ పనులు అంతా గందరగోళంగా జరుగుతున్నాయి. వారికి అనువుగా ఉండే విధంగా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నారు.

అంతా గందరగోళం

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌కు నీటి సౌకర్యాన్ని ఏపీఐఐసీ అధికారులు 2023 మే నెలలో పైపులైన్‌ పనులను ప్రారంభించారు. 56 కి.మీటర్ల మేర జరుగుతున్న ఈ పైప్‌లైన్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ముచ్చుమర్రి గ్రామం మినహా అంతా పూర్తి కావస్తున్నాయి. పైప్‌లైన్‌ పనులు చేపడుతున్న గుత్తేదారు చేస్తున్న పనులు గందరగోళంగా జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బి రోడ్డుకు కుడివైపున తీసుకెళ్లేందుకు అనుమతులు ఉండగా... కొణిదేల గ్రామంలో నడిరోడ్డును తవ్వుతూ పైప్‌లైన్‌ను తీసుకెళ్తున్నారు. బీటీ రోడ్డు వేసి రెండు మూడు నెలలు కాకముందే రోడ్డును తవ్వుతూ పైపులైన్‌ను తీసుకెళ్తున్నారు. దీంతో కొత్తగా వేసిన 11 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.4.5 కోట్లు ఖర్చు చేశారు. ఖర్చు నిధులు వృధాకావడంతో పాటు, నడి రోడ్డు కింద ఉన్న పైపు లైన్‌ ఏ మేరకు క్వాలిటీ ఉండేదీ అనుమానమే. సుమారు అర కిలో మీటరు వరకు పైపులైన్‌ కోసం రోడ్డును తవ్వారు. పైపు లైన్‌ పైన రోడ్డు ఉంటే భవిష్యత్తులో పైపులైన్‌ ఎంత పటిష్టంగా ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెహ్రూనగర్‌, ముచ్చుమర్రి, కొణిదేల గ్రామాలకు సంబంధించిన రైతులు పండించిన పంటలను తరలించేందుకు భారీ వాహనాల రాకపోకలు ఈ రోడ్డుపైన సాగుతాయి. భారీ వాహనాల రాకపోకలతో ఆ పైపులైన్‌ ఏమేరకు నాణ్యంగా ఉండేదీ అర్థం కాని పరిస్థితి. ఈ గ్రామంలో సమస్య ఇలా ఉంటే 10 బొల్లవరం గ్రామంలో పైపులైన్‌ తీసే సమయంలో సీపీడబ్ల్యూసీ పథకం క్రింద ఏర్పాటు చేసిన మంచి నీటి పైపులైన్‌ను తొలగించారు. పైపులను ఏర్పాటు చేశాక...సీపీడబ్ల్యూసీ పథకం పైపులైన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అయితే గుత్తేదారు తన పైపులైన్‌ పనులు పూర్తి చేసుకున్నాడే తప్ప.. గ్రామంలోని తాగునీటి పైపులైన్‌ పనులను గాలికి వదిలేశాడని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతుందని, ఇలాంటి సమయంలో పైప్‌లైన్‌ లేకపోతే ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎక్కడపడితే అక్కడ వారికి అనుకూలంగా పైప్‌లైన్‌ కోసం రోడ్డును తవ్వేయడంతో ఆ గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గ్రామాల్లోనే ఇలా ఉంటే నందికొట్కూరు పట్టణంలో పైపులైన్‌ను ఎలా తీసుకెళ్తారన్నది అర్థంకాని పరిస్థితి. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట తీసుకెళ్తారా..? లేక శివారు ప్రాంతంలో తీసుకెళ్తారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కలో పైప్‌ లైన్‌ తీసుకెళ్తామని చెప్పి కొణిదేల గ్రామంలో నడి రోడ్డును తవ్వుతూ పైప్‌లైన్‌ పనులు సాగుతున్నాయి. ఇది చూసే వారు ముక్కున వేలేసుకోవడం తప్ప పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు వాపోతున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:05 PM