ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పుస్తెలు వద్దు.. పుస్తకాలే ముద్దు

ABN, Publish Date - Feb 22 , 2025 | 12:06 AM

బాల్య వివాహాలను అరికట్టాలని శుక్రవారం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ కూడలిలో మానవహారం నిర్మించారు. హెచ్‌ఎం సుజాత, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మావతి పాల్గొన్నారు.

ఆలూరులో మానవహారం నిర్మించిన విద్యార్థినులు

బాల్య వివాహాలు వద్దని విద్యార్థుల ర్యాలీ

ఆలూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను అరికట్టాలని శుక్రవారం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ కూడలిలో మానవహారం నిర్మించారు. హెచ్‌ఎం సుజాత, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మావతి పాల్గొన్నారు.

ఆదోని అగ్రికల్చర్‌: బాల్య వివాహాలు చేయడం నేరమని కుప్పగల్లు ఉన్నత పాఠశాల హెచెం చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం గ్రామంలో బాల్య వివాహహాలను అరికట్టాలని విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

దేవనకొండ: పుస్తెలు వద్దు పుస్తకాలే ముద్దని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు నినాదాలు చేశారు. బాల్య వివాహాలు చేయొద్దని శుక్రవారం దేవనకొండలో ర్యాలీ నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా, చదివించాలని కోరారు. బాలిక చదువుతో దేశానికి భద్రత ఉంటుందని ఫ్రిస్సిపాల్‌ సునీత అన్నారు. ఉపాధ్యాయి నులు లీలా, మంజుల, రేణుక, గీత పాల్గొన్నారు.

హాలహర్వి: బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వరలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం హాలహర్విలో విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గ్రాఆల్లో బాల్యవివాహలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఐసీడీఎస్‌ సుపర్‌ వైజర్లు చందన, చంద్రవతి పాల్గొన్నారు.

తుగ్గలి: బాల్య వివాహాలు నేరమని హెచ్‌ఎం రాజామోహన్‌, పీడీ చందూ నాయక్‌ అన్నారు. శుక్రవారం తుగ్గలి జడ్పీ హై స్కూల్‌లో ర్యాలీ నిర్వహించారు. 21 సంవత్సరాలు పూర్తయ్యాక పెళ్లి చేస్తే సమాజంపై అవగాహన ఉండి చక్కగా కాపురాలు చేసుకుం టారన్నారు. ఉపాధ్యాయులు సుధాకర్‌, భాస్కర్‌, చాంద్‌, రంగనాయక్‌, శ్రీనివాసులు, రిజ్వాన, తదితరులు ఉన్నారు.

మద్దికెర: బాల్య వివాహాలు నేరమని ప్రభుత్వ వైద్యాధికారి రాగిణి, ఎంపీడీవో కొండయ్య అన్నారు. శుక్రవారం కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాలతో అనారోగ్యం, రక్తహీనత, మాతాశిశు మరణాలు సంభవిస్తాయన్నారు. 18 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లలకు వివాహం చేస్తే 2ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ప్రిన్సిపాల్‌ జ్యోతిరెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అక్బర్‌ బాషా, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అంజలి ఉన్నారు.

Updated Date - Feb 22 , 2025 | 12:06 AM