గత ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం
ABN, Publish Date - Feb 16 , 2025 | 11:47 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు.
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్
రూ.2.42 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచే విధంగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. నగరంలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. ఆదివారం 5 వార్డుల్లో రూ.2.42 కోట్లతో వివిద అభివృద్ధి పనులకు మంత్రి, నగర పాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. 50వ వార్డు కొత్తపేటలో ముస్లిం శ్మశాన వాటికలో రూ.20 లక్షలతో వసతుల కల్పన, 2వ వార్డు హజీరా కాలేజీ నుండి వాసవి కాలేజీ వరకు రూ.35 లక్షలతో మురుగు కాలువ నిర్మాణం, 12వ వార్డులో డబారా కాలనీ, కేవీఆర్ గార్డెన్ ప్రాంతాల్లో రూ.62.4 లక్షలతో మురుగు కాలువలు, 24వ వార్డు లక్ష్మీనగర్‌లో రూ.75 లక్షలతో మురుగు కాలువలు, 23వ వార్డు శ్రీరామ్‌నగర్‌లోని పలు కాలనీల్లో రూ.50 లక్షలతో మురుగు కాలువల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకువచ్చిన సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై 85 శాతం వరకు గుంతలను పూడ్చారని, త్వరలో 2వ విడత పనులు జరుగుతాయని అన్నారు. మూడు నెలల్లో శంకుస్థాపన చేసిన పనులన్ని పూర్తి చేస్తామన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వార్డులో కాలనీ వారీగా ప్రాధాన్యత క్రమంలో వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కురువ పరమేష్, అబ్దుల్ లతీఫ్, క్రాంతికుమార్, రమణమ్మ, ఎస్‌ఈ రాజశేఖర్, డీఈఈలు క్రిష్ణలత, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు నగరంలో..
నగరంలో మరిన్ని కీలకమైన అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేయనున్నారు. ఆయనతోపాటు ఎంపి బస్తిపాటి నాగరాజు, నగర మేయర్ బీవై. రామయ్య, ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కమిషనర్ రవీంద్రబాబు పాల్గొంటారు.
Updated Date - Feb 16 , 2025 | 11:48 PM