ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గీత కార్మికులకు మద్యం దుకాణాలు

ABN, Publish Date - Jan 25 , 2025 | 12:17 AM

గీత కులస్థులకు మద్యం దుకాణాలు కేటాయించారు.

డిప్‌ తీస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

27న నోటిఫికేషన్‌, 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ

వచ్చే నెల 7న డిప్‌ తీయనున్న కలెక్టర్‌

కర్నూలు అర్బన్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గీత కులస్థులకు మద్యం దుకాణాలు కేటాయించారు. డిప్‌ ద్వారా జాయింట్‌ కలెక్టర్‌ బీ. నవ్య ఖరారు చేశారు. శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్లో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ కుమార్‌ ఆఽధ్వర్యంలో జిల్లాలోని గీత ఉప కులాలకు దుకాణాలను జనాభా, దుకాణాల ప్రాతిపదికల మీద 10 శాతం దుకాణాలను డిప్‌ ద్వారా ఎంపిక చేశారు. ఈడిగ-6, గౌడ్‌-3, గౌడ-1 చొప్పున దుకాణాలను కేటాయించారు. వీటికి ఈనెల 27 నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. 5వ వరకు దరఖాస్తుల స్వీకరణ, ఫిబ్రవరి 7న కలెక్టర్‌ డిప్‌ ద్వారా దుకాణాలను ఎంపిక చేసి లబ్ధిదారులకు కే టాయించనున్నారు. 50 శాతం రాయితీతో మాత్రమే దుకాణాలకు లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈడిగ కులాల్లో ఆదోని మున్సిపాలిటీ, ఆదోని రూరల్‌, మద్దికెర, కోసిగి, చిప్పగిరి, ఆస్పరి, గౌడ్‌లకు కర్నూలు కార్పొరేషన్‌, క్రిష్టగిరి, కౌతాళం, గౌడ కులస్థులకు ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో దుకాణాలను కేటాయించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌ సీఐలు రాజేంద్ర ప్రసాద్‌, చంద్రహాస పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:17 AM