ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి

ABN, Publish Date - Jan 18 , 2025 | 11:26 PM

మన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్సీ, కమిషనర్‌, చైర్‌పర్సన్‌

స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌లో భాగం కండి -కలెక్టర్‌

నంద్యాల (కల్చరల్‌), జనవరి 18: మన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ప్రాంగణమంతా తిరిగి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నివాస ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపా లిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్‌స్టాపులు, రైల్వేస్టేషన్లు, పరిశ్ర మలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. మున్సిపల్‌ కార్యాలయం నుండి మున్సిపల్‌ టౌన్‌ హాల్‌ వరకు జరిగిన భారీ ర్యాలీ కార్యక్రమానికి కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ రజియాసుల్తానా, డిపో మేనేజర్‌ గంగాధర్‌, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మున్సిపల్‌ కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి, చైర్‌పర్సన్‌ మాబున్నిసా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:26 PM