ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి

ABN, Publish Date - Feb 21 , 2025 | 12:20 AM

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సోగనూరు రోడ్డులో ఉన్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు కంటి సమస్యలు రావ డం బాధాకరమన్నారు. అయినప్పటికి ప్రభుత్వం ముందుగానే గుర్తించి అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 18 పాఠశాల లకు చెందిన 9,882 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామ న్నారు. వీరిలో కంటిచూపు సమస్య ఉన్న 382మంది విద్యార్థులను గుర్తించి వారికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తుం దన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌ హెచవో సత్యవతి, జిల్లా అధికారి సంధ్యారెడ్డి, ఎంఈవో మధుసుదనరాజు, గోవిందరాజులు, టీడీపీ నాయ కులు రంగస్వామిగౌడు, అమాన పాల్గొన్నారు.

దేవిబెట్ట గ్రామాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు రూరల్‌: మండలంలోని దేవిబెట్ట గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దేవిబెట్ట గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయ తీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామం లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని ఎంపీ డీవో బంగారమ్మ, ఈవోపీఆర్డీ విజయలక్ష్మీలను ఆదేశించారు. అలాగే కొంతమంది ప్రజలు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు దేవిబెట్ట సోమేశ్వరరెడ్డి, రాముడు, నాగరాజు గౌడు, జగదీష్‌స్వామి, మహదేవప్పస్వామి, గిర్ణి సోమశేఖర్‌రెడ్డి, మండల నాయకులు కెటి. వెంకటేశ్వర్లు, సోగనూరు జగదీష్‌, రాఘవేంద్ర, బోడ బండ సురేష్‌, నరసన్నగౌడు, తహసీల్దార్‌ శేషఫణి, పీఆర్‌ ఏఈ జయన్న పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 12:20 AM