ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీగిరిలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

ABN, Publish Date - Mar 08 , 2025 | 11:02 PM

శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా జరిగింది.

స్వర్ణరథంపై స్వామి అమ్మవార్లు

శ్రీశైలం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో శనివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా జరిగింది. వేకువజామున మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు స్వర్ణరథాన్ని నేత్రశోభితంగా పుష్పాలతో అలంకరించారు. ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు స్వర్ణరథానికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లు ఆశీనులైన స్వర్ణరథం ఆలయ మాఢవీధుల్లో అశేష భక్తజనం నడుమ వైభవంగా జరిగింది. స్వర్ణరథం ఎదుట కోలాటం, చెక్కభజన, జానపద కళాకారులు భక్తలను ఆకట్టుకుంది. భద్రతా ఏర్పాట్లను సీఐ ప్రసాదరావు, దేవస్థానం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ కె. అయ్యన్న పర్యవేక్షించారు.

Updated Date - Mar 08 , 2025 | 11:02 PM