పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:08 AM
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
నగరంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్
కల్లూరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 20, 41వ వార్డుల్లోని మాధవీనగర్ నారాయణ స్కూల్, వీకర్‌సెక్షన కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన స్వఛ్ఛ ఆంధ్ర..స్వర్ణ ఆంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిఽథిగా హాజ రయ్యారు. విద్యార్థులకు తడి, పొడి చెత్త కుండీల వాడకం, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతల ప్రాముఖ్యతపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమా లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ప్రజా ఆరోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు కె.పార్వతమ్మ, పెరుగు పురుషోత్తంరెడ్డి, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, జవ్వాజి గంగాధర్‌గౌడ్, నాగేశ్వరరావు, జనార్ధన ఆచారి, రాఘవేంద్రాచారి, మహేష్‌గౌడ్, పారి శుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛత పనుల్లో సీఈ కబీర్‌బాషా
కర్నూలు- ఆంధ్రజ్యోతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం ‘స్వచ్ఛత దివాస్’ కార్యక్రమం నిర్వహించారు. శనివారం కర్నూ లు నగరంలో జలవనరుల శాఖ సీఈ కార్యాలయంలో సీఈ కబీర్ బాషా సహా ఇంజనీర్లు, సిబ్బంది చెత్తాచెదారం శుభ్రం చేశారు. అలాగే.. కర్నూ లు సర్కిల్ కార్యాలయం ఆవరణలో డీఈఈ షేక్ కరీమూన, సుష్మా, సూపరింటెండెంట్ విజయభారతి, ఏఈఈలు సంధ్యారాణి, మహేశ్వరి, సర్వతిబాయ్, గోపినాథ్, సిబ్బంది చెత్త చెదారాన్ని శుభ్రం చేశారు.
కర్నూలు రూరల్: కృత్రిమ ఎరువులు వాడకంతోనే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో శనివారం జరి గిన స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని పారిశుధ్య కార్మికులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘునాథ్, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం, నరేంద్రనాథ్‌రెడ్డి, అలిపీరా, తహేర్‌బేగ్, సీతారామిరెడ్డి, రెడ్డిపోగు యేసేపు, రెడ్డిపోగు సురేష్ పాల్గొన్నారు.
ఫ పంచలింగాల గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్ర మంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం చెత్త సేకరణకు కూడా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్తప న్నును ఎత్తివేసిందని గుర్తు చేశారు. అనంతరం పరిశుభ్రతపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
Updated Date - Feb 16 , 2025 | 12:08 AM