ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగు ప్రశ్నార్థకం..?

ABN, Publish Date - Mar 09 , 2025 | 12:15 AM

మండలంలోని బురుజుల, పెరవలి, బసినేపల్లి, రాంపురం, రాంపురం కొట్టాల, హంపా, బొమ్మనపల్లి, కొత్తపల్లి, ఎడవలి, మద్దికెర గ్రామాల పొలాలకు హంద్రీ నీవా కాలువ నీరే శరణ్యం. ఈ ప్రాంతంలో దాదాపు 5వేల ఎకరాల్లో వేరుశనగ, వరి మినుము, పత్తి, మిరప, తదితర పంటలు సాగు చేస్తున్నారు.

హంద్రీనీవా కాలువలో తగ్గిన నీరు.. కాలువ కింద సాగు చేసిన వరి పైరు

హంద్రీ నీవాకు నీటి సరఫరా నిలిపివేత

రైతుల ఆందోళన

మద్దికెర, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బురుజుల, పెరవలి, బసినేపల్లి, రాంపురం, రాంపురం కొట్టాల, హంపా, బొమ్మనపల్లి, కొత్తపల్లి, ఎడవలి, మద్దికెర గ్రామాల పొలాలకు హంద్రీ నీవా కాలువ నీరే శరణ్యం. ఈ ప్రాంతంలో దాదాపు 5వేల ఎకరాల్లో వేరుశనగ, వరి మినుము, పత్తి, మిరప, తదితర పంటలు సాగు చేస్తున్నారు.

కాలువలో తగ్గిన నీరు

రెండు రోజుల నుంచి శ్రీశైలం నుంచి హంద్రీనీవా కాలువకు అధికారులు నీరు నిలిపివేశారు. దీంతో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఏడాది ఏప్రిల్‌ ఆఖరు వరకు నీరు సరఫరా చేసేవారు. అయితే ఈ ఏడాది మార్చి 3వ తేదీకే నీటి సరఫరా నిలిపివేడంతో ఏం చేయాలో తెలియక బంద్‌ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మరో 30రోజులు సరఫరా చేస్తే..

కాలువకు మరో 30 రోజులు నీళ్లిస్తే పంటలు చేతికి వస్తాయని అంతవరకైనా నీరు సరఫరా చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి ఏప్రిల్‌ రెండోవారం ముగిసేవరకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

నీరివ్వకుంటే పంటలు ఎండిపోతాయి

హంద్రీనీవా కాలువ కింద ఐదెకరా ల్లో వేరుశనగ సాగు చేశా. పంట ఇంకా కాయదశకు రాలేదు. ఇప్పుడు నీరు నిలిపేస్తే పంటలు ఎండిపో తాయి. - లింగన్న, రైతు, మద్దికెర

Updated Date - Mar 09 , 2025 | 12:15 AM