ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ రహదారిని పూర్తి చేయాలి

ABN, Publish Date - Feb 15 , 2025 | 12:25 AM

జాతీయ రహదారి పనులు పూర్తికాక ప్రజల ప్రాణాలు పోతున్నా లెక్కలేదా అని సీపీఐ, సీపీఎం నాయకులు భూపేశ్‌, రామాంజినేయులు, హనుమంతు, రంగన్న, బాషా మండిపడ్డారు

రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్న నాయకులు

హైవేను దిగ్బంధించిన ప్రజాసంఘాలు

ఎస్‌ఐ హామీతో ఆందోళన విరమణ

ఆలూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పనులు పూర్తికాక ప్రజల ప్రాణాలు పోతున్నా లెక్కలేదా అని సీపీఐ, సీపీఎం నాయకులు భూపేశ్‌, రామాంజినేయులు, హనుమంతు, రంగన్న, బాషా మండిపడ్డారు. శుక్రవారం ఆలూరులో, ప్రజలు, నాయకులు రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో గంట పాటు ఆలూరు-బళ్ళారి మార్గంలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్సై దిలీప్‌ కుమార్‌ జోక్యం చేసుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని, ఆందోళన విరమించాలని నచ్చజెప్పినా వారు వినలేదు. ఎస్సైకు ప్రజా సంఘాల నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు వచ్చేవరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పడంతో ఆర్‌అండ్‌బీ అధికారులకు ఫోన్‌ చేసి సమస్యను వివరించారు. వారు 20 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇప్పించడంతో ఆందోళనను విరమించారు. ఆందోళనకు వైసీపీ నాయకుడు వైకుంఠం మల్లికార్జున చౌదరి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు మైనా, నాయకులు బాషా, అజంత లక్ష్మీరెడ్డి, రమేష్‌, విజయ లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:25 AM