ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘పది’ పరీక్షలపై కలెక్టర్‌ సమీక్ష

ABN, Publish Date - Mar 01 , 2025 | 12:09 AM

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా పరీక్ష నిర్వాహకులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా పరీక్ష నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత మూడేళ్లలో జరిగిన సంఘటనల దృష్ట్యా సమస్యాత్మకంగా గుర్తించిన పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగేలా పోలీసులు, తహసీల్దార్ల సహకారాలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలకు లోటు లేకుండా ముందుగానే తనిఖీలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్‌ పాల్‌, ఉప విద్యాశాఖ అధికారి హనుమంతరావు, ఎగ్జామినేషన్స్‌ నోడల్‌ ఆఫీసర్‌ చంద్రభూషణ్‌, చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2025 | 12:09 AM