ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోవెలకుంట్లలో ఘరానా మోసం

ABN, Publish Date - Feb 09 , 2025 | 12:10 AM

కోవెలకుంట్లలో ఘరానా మోసం చోటు చేసుకున్నది. రూ. పది లక్షల డబ్బులు ఇస్తే రూ.30లక్షలు విలువ చేసే దుబాయి కరెన్సీ ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.10 లక్షలు తీసుకొని పైన, కింద దుబాయ్‌ కరెన్సీ నోట్లు పెట్టి మధ్యలో చెత్తకాగితాలతో నిండిన మూట ఇచ్చి సదరు వ్యక్తి ఉడాయించాడు.

బాధితులు శ్రీనివాసులు, మహ్మద్‌ బాషా

దుబాయ్‌ నోట్లు ఇస్తామని మాయమాటలు

నమ్మి చేరో రూ.5 లక్షలు ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు

చెత్తకాగితాల మూట ఇచ్చి ఉడాయింపు

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

కోవెలకుంట్ల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కోవెలకుంట్లలో ఘరానా మోసం చోటు చేసుకున్నది. రూ. పది లక్షల డబ్బులు ఇస్తే రూ.30లక్షలు విలువ చేసే దుబాయి కరెన్సీ ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.10 లక్షలు తీసుకొని పైన, కింద దుబాయ్‌ కరెన్సీ నోట్లు పెట్టి మధ్యలో చెత్తకాగితాలతో నిండిన మూట ఇచ్చి సదరు వ్యక్తి ఉడాయించాడు. బాధి తులు మూట విప్పి చెత్తకాగితాలను చూసి మోసపో యామంటూ శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. బాఽధితులు సయ్యద్‌ మహబూబ్‌బాషా, డి.శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. నంద్యాల పట్టణంలోని రామాలయం వద్ద ఉన్న జ్యూస్‌ బండి వద్దకు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి జ్యూస్‌ తాగి దుబాయ్‌ నోటు ఇచ్చాడు. ఈ నోటు చెల్లదు మామూలు నోటు ఇవ్వాలని జ్యూస్‌బండి యజ మాని అడిగాడు. దీంతో తాను దుబాయ్‌లో పనిచేస్తానని, అక్కడి డబ్బులు ఇవి అని చెప్పాడు. పక్కనే ఉన్న టెంకాయలు అమ్ముకునే సయ్యద్‌ మహ్మద్‌బాషాకు ఆ నోటును చూపించారు. మహ్మద్‌బాషా ఆ నోటును నెట్‌లో చెక్‌ చేయగా అది ఒరిజినల్‌గా తేలింది. దీంతో అతడితో మాటలు కలిపి ఈ నోట్లు తన వద్ద చాలా ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తామని, రేపు రండని సదరు వ్యక్తి సయ్యద్‌ బాషాను నమ్మించాడు. దీంతో సయ్యద్‌ అతడి స్నేహి తుడు శ్రీనివాసులును తీసుకొని మరుటిరోజు శుక్రవారం ఆళ్లగడ్డకు వెళ్లాడు. సదరు వ్యక్తి నెంబరుకు ఫోను చేయగా బస్టాండు వద్దనే ఉండండి వస్తామని చెప్పి కొన్ని గంటలు కాలయాపన చేయించాడు. తీరా సాయంత్రం ఓ మహిళ మహబూబ్‌బాషా నెంబరుకు ఫోన్‌ చేసి రూ.10 లక్షలు నోట్లు ఇస్తే రూ.30 లక్షలు విలువ చేసే దుబాయి నోట్లు ఇస్తామని నమ్మించింది. దీంతో శుక్రవారం రాత్రి నంద్యాల కు వెళ్లి శనివారం ఉదయం మహబూబ్‌బాషా రూ.5 లక్ష లు, డి.శ్రీనివాసులు రూ.5 లక్షలు తీసుకొని వచ్చి మళ్లీ ఫోన్‌ చేశారు. సదరు వ్యక్తి తాము ఆళ్లగడ్డలో లేమని కోవెలకుం ట్లలో ఉన్నామని బస్టాండు సమీపంలోని షాపు వద్దకు రావాలని తెలిపారు. మహబూబ్‌బాషా, శ్రీనివా సులు ఇద్దరూ రూ.10 లక్షలు తీసుకుని కోవెలకుంట్లకు వచ్చారు. సదరు వ్యక్తి దుబాయి నోట్లు పైన రెండు కింద రెండు పెట్టి మధ్యన చెత్తకాగితాలు పెట్టిన కట్టలను మూటలో పెట్టుకొ ని బైక్‌పై వచ్చి వారికి మూట ఇచ్చి వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు తీసుకుని ఉడయించాడు. సదరు వ్యక్తి వెళ్లిన తరువాత వీరిద్దరూ కొంత దూరం వెళ్లి ఆ మూట విప్పి చూడగా రెండు మూడు దుబాయినోట్లు తప్ప అంతా చెత్తకాగితాలు ఉండడంతో మోసపోయామని లబోదిబో మంటూ కోవెలకుంట్ల పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 09 , 2025 | 12:10 AM