బలరాముడు
ABN, Publish Date - Mar 02 , 2025 | 11:43 PM
పేరు దశరథరాముడే అయినా రాతి గుండు ఎత్తే పోటీల్లో బలరాముడు అనిపించుకున్నాడు. 185 కేజీల గుండును అవలీలగా ఎత్తి శభాష్ అనిపించుకున్నాడు.
185 కేజీల గుండును అవలీలగా ఎత్తిన కర్ణాటకవాసి
పెద్దకడుబూరు, మార్చి 2(ఆంధ్రజ్యోతి): పేరు దశరథరాముడే అయినా రాతి గుండు ఎత్తే పోటీల్లో బలరాముడు అనిపించుకున్నాడు. 185 కేజీల గుండును అవలీలగా ఎత్తి శభాష్ అనిపించుకున్నాడు. పెద్దకడుబూరులో శ్రీసిద్ధారుడ స్వామి జాతరను పురస్కరించుకొని గుండు ఎత్తుడు పోటీలు నిర్వహించారు. ఆంధ్రా, కర్ణాటక ప్రాంతాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు యువకులు వచ్చారు. వీరిలో కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ తాలుకా యర్రవల్లి గ్రామానికి చెందిన దశరథ రాముడు మొదటగా 150 కేజీల బరువు ఎత్తాడు. అలాగే రెండోసారి 178 కేజీలు, మూడోసారి 185 కేజీల గజ్జల గుండును ఎత్తి మొదటి బహుమతి 15 తులాల వెండిని కైవసం చేసుకున్నాడు. అలాగే కర్ణాటక రాష్ట్రం మాన్వి తాలుకా కప్పగల్లుకు చెందిన కర్ణ 150 కేజీలు, 178 కేజీల గుండును ఎత్తి ద్వితీయ బహుమతి 10 తులాల వెండిని గెలుచుకున్నాడు. ఈ పోటీలను తిలకించేందుకు ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో నిర్వాహకులు రామ్మోహన్‌రెడ్డి, రామలింగారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రఘురామ్, సర్పంచ్ రామాంజనేయులు, ఒట్రు దస్తగిరి, శాంతిమూర్తి, రామాంజిని, నీలకంఠప్పలు పాల్గొన్నారు.
Updated Date - Mar 02 , 2025 | 11:43 PM