కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
ABN, Publish Date - Feb 05 , 2025 | 12:49 AM
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టా లను రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు బాలరాజులు డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరు రూరల్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షకులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టా లను రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు బాలరాజులు డిమాండ్ చేశారు. మం గళవారం స్థానిక సోమప్ప సర్కిల్‌లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుసగా మూడోసారి అధికా రంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి అందరిని ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 44 కార్మిక హక్కుల చట్టాలను కుదించిందన్నారు. ఏప్రిల్ నుంచి నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో మునెప్ప, నాగేంద్ర, రాఘవేంద్ర, అంజినయ్య, ఉరుకుందు, నరసింహులు, ఓబు లేసు పాల్గొన్నారు.
Updated Date - Feb 05 , 2025 | 12:49 AM