ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కృష్ణానదిలో స్నానానికి దిగి యువకుడి మృతి

ABN, Publish Date - Feb 16 , 2025 | 01:24 AM

వేదాద్రి వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం జరిగింది.

జగ్గయ్యపేట రూరల్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): వేదాద్రి వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగిన యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తోట సూర్య శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన పోతుమర్తి నవీన్‌, గుడారి పద్మారావు బావబామ్మర్దులు. ఇద్దరూ బైకుపై వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత స్నానానికి కృష్ణా నదిలోకి దిగారు. నవీన్‌(23) నదిలో పడి మునిగియాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.

Updated Date - Feb 16 , 2025 | 01:24 AM