వైసీపీ.. ఓ 420 పార్టీ
ABN, Publish Date - Feb 09 , 2025 | 01:55 AM
వైసీపీ..ఓ 420 పార్టీ అని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిస్ట్రక్టర్ అని సీఎం చంద్రబాబు కనస్ట్రక్టర్ అని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవలి శ్రీదేవి అన్నారు.
జగన్ డిస్ట్రక్టర్.. చంద్రబాబు కనస్ట్రక్టర్: ఉండవల్లి శ్రీదేవి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ..ఓ 420 పార్టీ అని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిస్ట్రక్టర్ అని సీఎం చంద్రబాబు కనస్ట్రక్టర్ అని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్, మాజీ ఎమ్మెల్యే, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవలి శ్రీదేవి అన్నారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా) గెలుపును కాంక్షిస్తూ కొండపల్లి మున్సిపల్ టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు.
అమరావతి రోడ్లపై కంకర కొట్టేసిన పార్టీ
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదిక కూల్చి ఆరు నెలల్లో మూడు రాజధానుల ఆట మొదలు పెట్టిన జగన్ వల్ల ఎమ్మెల్యేగా బయటకు రాలేకపోయానని శ్రీదేవి తెలి పారు. రోడ్లపై పోసిన కంకర కూడా కొట్టేసిన పార్టీ వైసీపీ అని దుయ్యబటారు. నంది గం సురేష్ అనే 420ని పెంచిపోషించి ప్రజా రాజధాని అమరావతిలో ఒక్క సీసీ రోడ్డు వేయకుండా లైటు వేయకుండా అనేక ఇబ్బందులకు జగన్ గురి చేశాడన్నారు. దళిత నేతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నానన్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజాకు తొలి ప్రాధాన్య ఓటు వేసి, అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. దారునా యక్, చెన్నుబోయిన చిట్టిబాబు, చుట్టుకుదురు శ్రీనివాసరావు, చనమోలు నారాయణ, చుట్టుకుదురు వాసు, మైలా సైదులు, అఫ్సర్ పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 01:55 AM