మహిళలు..దివ్యశక్తి స్వరూపిణులు
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:44 AM
మహిళలు దివ్యశక్తి స్వరూపిణులని, మహిళలు లేనిదే సమాజ అభివృద్ధి లేదని భారతీయం చైర్మ న్ సత్యవాణి అన్నారు.
భారతీయం చైర్మన్ సత్యవాణి
మచిలీపట్నం టౌన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళలు దివ్యశక్తి స్వరూపిణులని, మహిళలు లేనిదే సమాజ అభివృద్ధి లేదని భారతీయం చైర్మ న్ సత్యవాణి అన్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ అధ్యక్షతన పోలీసు కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సత్యవాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళా హోమ్‌గార్డులను సత్కరించారు. మహిళలు చేసిన వంటకాలను కలెక్టర్ డీకే బాలజీ సతీమణి పృథ్వీ కల్యాణి, ఎస్పీ గంగాధరరావు సతీమణి పద్మజ, కొల్లు నీలిమ రుచి చూశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహిళలకు పలు పోటీలు నిర్వహించారు. విజేతల కు కొల్లు నీలిమ బహుమతులు అందజేశారు.
Updated Date - Mar 08 , 2025 | 01:44 AM