వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరుడి వసంతోత్సవం
ABN, Publish Date - Feb 06 , 2025 | 01:49 AM
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగం గా నాలుగోరోజు బుధవారం స్వామికి వసంతోత్సవం, అవభృదస్నానోత్సవాలను వైభవంగా నిర్వహించారు.
మోపిదేవి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగం గా నాలుగోరోజు బుధవారం స్వామికి వసంతోత్సవం, అవభృదస్నానోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామికి సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చన, నిత్యహోమం, బలిహరణను అర్చకబృందం శాస్త్రోక్తం గా జరిపింది. స్వామి, అమ్మవార్లకు పండ్ల రసాలు, పంచామృతాలతో అభిషేకాలను ఆలయ ఈవో డి.శ్రీరామవరప్రసాదరావు ప్రారంభించారు. ప్రధాన అర్చకుడు బుద్దు పవన్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేక అభిషేకాలు, వసంతోత్సవం నిర్వహించారు. వేదపండితులు మహాపూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు.
Updated Date - Feb 06 , 2025 | 01:49 AM