విద్యారంగ సంస్కరణలతో మారుతున్న దేశ ముఖచిత్రం
ABN, Publish Date - Mar 08 , 2025 | 01:39 AM
విద్యారంగంలో సంస్కరణలతో దేశ ముఖ చిత్రం మారుతోందని, ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం చర్యలు తీసుకుంటోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ అన్నారు.
సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్
మొగల్రాజపురం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో సంస్కరణలతో దేశ ముఖ చిత్రం మారుతోందని, ఉన్నత విద్యను బలోపేతం చేసేందుకు విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం చర్యలు తీసుకుంటోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ అన్నారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన విద్యావిధానం 2020లో మార్పులతో విద్యార్థికి చదువుకునే కోర్సుల్లో పరిమితులు తీసేశారన్నారు. డిగ్రీ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా నచ్చిన పీజీ కోర్సులు తీసుకోవచ్చని తెలిపా రు. కొత్తగా వచ్చిన ప్రాంప్ట్ ఇంజనీరింగ్, కృత్రిమ మేధ లాంటి టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని సూచించారు. దేశ అవసరాలకు అనుగుణంగా నూతనంగా ఆలోచించాలని, పరిశోధనలు పెరగాలని, పారిశ్రామిక అవసరాలకు అనుగుణం గా విద్యాసంస్థలు కొత్త కోర్సుల బోధనపై దృష్టిపెట్టాలన్నారు. సిద్ధార్థ విద్యాసంస్థ లు ఏర్పాటై యాభై సంవత్సరాలు అవడం అభింనదనీయం అన్నారు. ఎంతో మంది సిద్ధార్థ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు, బ్యూరోక్రాట్లు, న్యాయాధిపతులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, ఇంజనీర్లు, డాక్టర్లుగా ఉండడం గర్వకారణమని సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు మలినేని రాజయ్య, పాలడుగు లక్ష్మణరావు అన్నారు. ఈరోజు డీమ్డ్ యూనివర్శిటీ స్థాయికి ఎదిగిందన్నారు. స్వర్ణోత్సవ లోగోను మామిడాల జగదీ్‌షకుమార్ చేతుల మీదుగా అవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రొఫెసర్ మధుమూర్తి, కృష్ణాయూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎన్.ఉషా, రెక్టార్ ఫ్రొఫెసర్ బసవేశ్వరరావు, సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమీషనర్ కేవీ చౌదరి పాల్గొన్నారు.
Updated Date - Mar 08 , 2025 | 01:39 AM