సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత టీడీపీదే
ABN, Publish Date - Jan 05 , 2025 | 12:43 AM
రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేసిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానిదేనని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు.
సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత టీడీపీదే
కృష్ణలంక పొటి శ్రీరాములు కళాశాలలో
మధ్యాహ్న భోజనం ప్రారంభించిన ఎమ్మెల్యే గదె ్ద
కృష్ణలంక, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని పేదల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేసిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానిదేనని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. శనివారం కృష్ణలంక పొట్టి శ్రీరాములు జూనియర్ కళాశాల ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించిన నాటి నుంచి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారని, తర్వాత దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. పిల్లలు చక్కగా చదువుకోవాలని తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఏరోజు ఏ పదార్థాలు ఇవ్వాలనే దానిపై టైం టేబుల్‌ను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దాత దమ్మాలపాటి రంగారావు, టీడీపీ నాయకులు గొరిపర్తి నామేశ్వరరావు, ముమ్మానేని ప్రసాద్, వేముల దుర్గారావు, కేశనం భావన్నారాయణ, కొర్రా అప్పన్న, వెన్నా శంకర్, ఆర్.రమాదేవి, కళాశాల ప్రిన్సిపాల్ వి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
మొగల్రాజపురం: స్థానిక 8వ డివిజన్ జమ్మిచెట్టు సెంటర్‌లో కెనరాబ్యాంకు రోడ్డుతో పాటు సమీపంలో ఉన్న మరో మూడు రోడ్లకు రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన నిర్మాణం పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి శనివారం శంకస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు అవుతోందని అప్పటి నుంచి నగరంలో నిరంతరం ఏదో ఒక డివిజన్‌లో అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నాయన్నారు. నగరంలో డ్రెయినేజీ, రోడ్లు, తాగునీటి అంశాలపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడి నిధులు మంజూరు చేయించి పనులు చేస్తామని చెప్పారు. గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి రోజు 70 లక్షల నుంచి కోటి రూపాయల మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, నాయకులు సుంకర మురళీ కృష్ణ, గద్దె సురేష్ బాబు, నున్న కృష్ణయ్య, మల్లెల రామకృష్ణ, వీఎంసీ ఈఈ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 05 , 2025 | 12:43 AM