ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంపద కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి

ABN, Publish Date - Feb 21 , 2025 | 01:12 AM

సంపదనిచ్చే చెత్తను తగలబెడతారా..సంపద కేంద్రాలను ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు? మరోసారి ఇలా జరిగితే నేను మాట్లాడను పెన్నే సమాదానం చెబుతుంది అంటూ అంగలూరు పంచాయతీ కార్యదర్శి ఎలీషారావును కలెక్టర్‌ డీకే బాలాజీ హెచ్చరించారు.

చెత్త నుంచి సంపద కేందాన్ని పరిశీలించాక, కార్యదర్శి ఎలీషారావును ప్రశ్నిస్తున్న కలెక్టర్‌ బాలాజీ

చెత్తను తగలబెట్టడంపై అంగలూరు కార్యదర్శిని ప్రశ్నించిన కలెక్టర్‌ డీకే బాలాజీ

గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సంపదనిచ్చే చెత్తను తగలబెడతారా..సంపద కేంద్రాలను ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు? మరోసారి ఇలా జరిగితే నేను మాట్లాడను పెన్నే సమాదానం చెబుతుంది అంటూ అంగలూరు పంచాయతీ కార్యదర్శి ఎలీషారావును కలెక్టర్‌ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం అంగలూరు లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను పారిశుధ్య కార్మికులు వేర్వేరుగా సేకరిస్తున్నారా అని మహిళలను అడిగారు. అంతా కలిపే తీసుకుంటున్నారని వారు కలెక్టర్‌ బాలాజీకి చెప్పారు. అక్కడి నుంచి చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఖానాల్లో సేకరించిన చెత్త లేదు. కేంద్రం సమీపంలో వేసి తగలబెట్టడాన్ని కలెక్టర్‌ గమనించారు. కార్యదర్శి, మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోగా చుట్టు పక్కల ప్రజలు అక్కడికి వచ్చి చెత్త తగలబెడుతుంటే ఇబ్బందిగా ఉందని, పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. పందులను పట్టించి అడవుల్లో వదిలేయాలని ఆదేశించారు. కొం దరు డ్రెయినేజీలు సరిగా లేవని ఫిర్యాదు చేయగా వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీవో విజయసారథి, తహశీల్దారు లోకరాజు పాల్గొన్నారు.

బొమ్ములూరు సంపద కేంద్రం పరిశీలన

గుడివాడ రూరల్‌: గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. గురువారం బొమ్ములూరులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని, రోజూ తెచ్చిన చెత్తను వేరుచేసి సంపద కేంద్రంలో తయారు చేసిన ఎరువులను పంచాయతీ కేంద్రాల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో డి.వై.విష్ణుప్రసాద్‌, కార్యదర్శి రామ్మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 01:12 AM