148 మందితో 108 సార్లు సూర్య నమస్కారాలు
ABN, Publish Date - Feb 03 , 2025 | 01:34 AM
ఆంధ్రప్రదేశ్ యోగ సభ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 148 మంది యోగసాధకులు, ఉపాధ్యాయు లు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యా ర్థులు 108 పర్యాయాలు సూర్య నమ స్కారాలు చేశారు.
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ యోగ సభ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 148 మంది యోగసాధకులు, ఉపాధ్యాయు లు, వ్యాపారులు, ఉద్యోగులు, విద్యా ర్థులు 108 పర్యాయాలు సూర్య నమ స్కారాలు చేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కూడా 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం విశేషం. ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిం ది. కార్యక్రమంలో యోగ గురువులు ఘంటసాల గురు నాథబాబు, మహా లక్ష్మి, మద్దాల చింతయ్య, ఆర్డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 03 , 2025 | 01:34 AM