ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Feb 03 , 2025 | 01:32 AM

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

పెండ్లి కుమారుడు, కుమార్తెగా అలంకరించి స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న అర్చక బృందం

మోపిదేవి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు స్వామిని పెండ్లి కుమారుడిని చేశాక ఆలయ ఈవో డి.శ్రీరామ వరప్రసాదరావు ప్రత్యేక పూజలు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ప్రధాన అర్చకుడు బుద్దు పవన్‌కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి పెండ్లి కుమారుడిని చేశారు. దేవాదాయశాఖ ఆలయ అనువంశిక ధర్మకర్తలైన చల్లపల్లి రాజా వంశీయుల తరఫున ఈవో శ్రీరామవరప్రసాదరావు స్వామి, అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చక బృందం నూతన వస్త్రాలతో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి, వేదమంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా పెండ్లి కుమారుడిని చేశా రు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు.

Updated Date - Feb 03 , 2025 | 01:32 AM