ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి

ABN, Publish Date - Feb 11 , 2025 | 01:04 AM

రాష్ట్ర ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని కూటమి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కోరారు.

పట్టభద్రుల సమావేశంలో మాట్లాడుతున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

పట్టభద్రుల సమావేశంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

గుడివాడ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రగతికి అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని కూటమి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కోరారు. సోమవారం వీకేఆర్‌ అండ్‌ వీఎన్‌బీ ఇంజినీరింగ్‌ కళాశాలలో పట్టభద్రులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి విజయాన్ని చేకూర్చాలని ఆయన కోరారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ఆలపాటికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని, శాసనమండలి ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. మచ్చలేని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను గెలిపించాలని గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు కోరారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఎన్టీఆర్‌ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బూరగడ్డ శ్రీకాంత్‌, బీజేపీ కన్వీనర్‌ దావులూరి సురేంద్రబాబు పాల్గొన్నారు.

గుడ్లవల్లేరులో ఆలపాటి ఎన్నికల ప్రచారం

గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంజనీరింగ్‌, డిప్లమో కళాశాలల అఽధ్యాపకులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. టీడీపీ గుడ్లవల్లేరు మండల కార్యాలయంలో ముఖ్యనాయకులు, బూత్‌ కమిటీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. మండలంలోని 1,400 మంది ఓట్లర్లను కలిసి కూటమి ప్రభుత్వం పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించి పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓట్లు వేసేలా పనిచేయాలని ఆయన కోరారు. అనంతరం కౌతవరంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, జిల్లా గ్రంఽథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ వల్లభనేని బాబూరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వల్లభనేని వెంకట్రావు, జంగం మోహనరావు, టీడీపీ గుడివా డ పట్టణాధ్యక్షుడు దింట్యాల రాంబాబు, అడుసుమిల్లి రామ్మోహనరావు, డీసీ చైర్మన్‌ పాలేటి వీరాంజనేయి లు, నీటి సంఘాల అధ్యక్షులు చలసాని శ్రీధర్‌, కరీం, తూము పద్మజ, పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 01:04 AM