కేఎస్ లక్ష్మణరావు..ఓ జిత్తులమారి
ABN, Publish Date - Feb 21 , 2025 | 01:09 AM
పాలశీతల కేంద్ర సమావేశపు మందిరంలో గురువారం నియోజకవర్గ కూటమిశ్రేణులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి కొమ్ము కాస్తారాయన
ఆయన మాటలు నమ్మి మోసపోకుండా పట్టభద్రులకు అవగాహన కల్పించండి
కూటమి నేతలతో టీడీపీ నేత వర్ల రామయ్య
పామర్రు, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘కూటమి బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌పై పోటీచేస్తున్న కేఎస్ లక్ష్మణరావు ఓ జిత్తులమారి. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీకి కొమ్ముకాసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాటలు నమ్మి మోసపోకుండా పట్టభద్రులకు అవగాహన కల్పించండి. నిరుద్యోగ యువత సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్యంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించండి’ అని కూటమి నేతలు, కార్యకర్తలకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూచించారు. పాలశీతల కేంద్ర సమావేశపు మందిరంలో గురువారం నియోజకవర్గ కూటమిశ్రేణులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో 6,400 పట్టభద్రుల ఓట్లు ఆలపాటికి పడేలా ప్రతి గ్రామంలోనూ కూటమి శ్రేణులు పనిచేయాలని సూచించారు. పట్టభద్రుల సమస్యలపట్ల పూర్తి అవగాహన ఉన్న ఆలపాటిని గెలిపించుకుందామన్నారు. ఆలపాటిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి తాడిశెట్టి నరేష్, టీడీపీ నేతలు కుదరవల్లి ప్రవీణ్‌చంద్ర, మండపాక శంకర్‌బాబు, రాజులపాటి శ్రీనివాసరావు, రామలింగేశ్వరరావు, జ క్కా శ్రీనివాసరావు, గొట్టిపాటి లక్ష్మీదాసు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Feb 21 , 2025 | 01:09 AM