ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యం

ABN, Publish Date - Feb 20 , 2025 | 12:34 AM

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని ఎంఎస్‌ఎంఈ రుణ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సంకే విశ్వనాఽథం తెలిపారు.

మాట్లాడుతున్న ఎంఎస్‌ఎంఈ రుణ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సంకే విశ్వనాథం

ప్రతి కుటుంబంలో

ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యం

ఎంఎస్‌ఎంఈ రుణ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సంకే విశ్వనాథం

మొగల్రాజపురం, ఫిబ్ర వరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని ఎంఎస్‌ఎంఈ రుణ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సంకే విశ్వనాఽథం తెలిపారు. 7వ డివిజన్‌లో మధ్య తరగతి ప్రజలు పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగాలనే విషయమై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం కింద ఎంఎస్‌ఎంఈ ద్వారా రుణాలు తీసుకోవడంపై కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సంకే విశ్వనాఽథం వివరించారు. ఎలాంటి యూనిట్స్‌ ఏర్పాటు చేసుకోవాలో, రుణాలు ఎలా ఎంత ఇస్తారు, బ్యాంకులో దరఖాస్తు చేసే విధానం నుంచి యూనిట్‌ పెట్టే వరకు ఎంపీ కేశినేని శివనాఽథ్‌ అందించే సహకారాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు పటమట సతీష్‌ చంద్ర, డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కొండపల్లి లక్ష్మణరావు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సంజయ్‌వర్మ, కార్యదర్శి దోమకొండ రవి, టీడీపీ రాష్ట్రనాయకులు మాదిగాని గురునాథం, మాజీ కార్పొరేటర్‌ మల్లికార్జునయాదవ్‌, ఉపాధ్యక్షులు పెనుగొండ శ్రీనివాస్‌, బూత్‌ కన్వీనర్‌లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, డివిజన్‌ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 12:35 AM