ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లైసెన్స్‌ లేకుండా నడిపితే వాహనం సీజ్‌

ABN, Publish Date - Jan 23 , 2025 | 12:38 AM

ద్విచక్రవాహనాలను లైసెన్స్‌ లేకుండా నడిపితే సదరు వాహనాన్ని సీజ్‌ చేస్తామని నాల్గవ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రామారావు తెలిపారు

పత్రాలు లేని వాహనాలు సీజ్‌ చేస్తున్న ట్రాఫిక్‌ సీఐ రామారావు

లైసెన్స్‌ లేకుండా నడిపితే వాహనం సీజ్‌

సీఐ రామారావు

గుణదల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనాలను లైసెన్స్‌ లేకుండా నడిపితే సదరు వాహనాన్ని సీజ్‌ చేస్తామని నాల్గవ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రామారావు తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా ఆయన బుధవారం రమేష్‌ హాస్పటల్‌ జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనచట్ట నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారు వాహనం నడపడం నేరమని, 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ లైసెన్స్‌ తీసుకోవాలన్నారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే సదరు వాహనాన్ని సీజ్‌ చేయడమే కాకుండా వాహనం ఎవరి పేరుమీద ఉంటుందో వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. త్రిబుల్‌ రైడింగ్‌ కూడా ఉపేక్షించేది లేదన్నారు. నోపార్కింగ్‌ ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్‌ చేసి వెళితే అటువంటి వాహనాలను డంపింగ్‌ యార్డ్‌కు తరలిస్తామని హెచ్చరించారు. వాహనాల తనిఖీ సమయంలో లైసెన్స్‌, వాహనపత్రాలు, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ పత్రాలు చూపడంతోపాటు హెల్మెట్‌ తప్పని సరిగా ఉండాలన్నారు.

Updated Date - Jan 23 , 2025 | 12:38 AM