ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐలూరు ఉత్సవాలను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Feb 21 , 2025 | 01:13 AM

ఐలూరులో ఈనెల 26న నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్‌ ఎం.కుసుమకుమారి సూచించారు.

మాట్లాడుతున్న తహశీల్దార్‌ కుసుమకుమారి, పక్కన ఎంపీడీవో రవికాంత్‌, సీఐ చిట్టిబాబు

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఐలూరులో ఈనెల 26న నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్‌ ఎం.కుసుమకుమారి సూచించారు. ఐలూరు శ్రీరామేశ్వరస్వామి దేవస్థానం వద్ద గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవస్థానం వద్ద భక్తులు దైవదర్శనం చేసుకునేందుకు బారికేడ్లు, ఇతర సదుపాయాలు, నదీపాయలో భక్తులు జల్లుస్నానాలు చేసేందుకు బోర్ల నిర్మాణం, మంచినీటి పంపులు, పారిశుధ్య చర్యలపై చర్చించారు. కార్యాచరణ పనులు మొదలు పెట్టాలని తహశీల్దార్‌ సూచించారు. లక్షమందికిపైగా భక్తులు వస్తారని, వారికి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేవస్థానం భూముల వివరాలను, వచ్చే ఆదాయాన్ని తెలపాలని సర్పంచ్‌ పీరాటి సుజాత డిమాండ్‌ చేయగా దేవస్థానానికి 50 ఎకరాలు మాత్రమే ఉన్నాయని ఈవో శివగోపాల్‌ తెలిపారు. పంచాయతీ నుంచి అన్ని పనులు చేయటం సాధ్యం కాదని చెప్పి మధ్యలోనే సర్పం చ్‌ వెళ్లిపోయారు. ఎంపీడీవో రవికాంత్‌, సీఐ వై.చిట్టిబాబు, ఎస్సై సీహె చ్‌ అవినాష్‌, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 01:13 AM