ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టమాటా కేజీ రూ.4

ABN, Publish Date - Feb 22 , 2025 | 01:41 AM

వేసవి ప్రారంభానికి ముందే టమాటా ధర అమాంతం పడిపోయింది. రైతుకు కిలో రూ.4 పలుకుతోంది. దీంతో రైతులు పంట కోయకుండానే తోటలను వదిలేస్తున్నారు. కొందరు దున్నేస్తున్నారు. కోత ఖర్చులు వచ్చే పరిస్థితి లేదని, అందుకే తోటలను వదిలేస్తున్నామని చెబుతున్నారు.

గడ్డమణుగు గ్రామంలో గంపా శ్రీనివాసరావు పొలంలో కోయకుండా వదిలేసిన టమాటా తోట

(జి.కొండూరు-ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 216 ఎకరాల్లో టమాటా సాగులో ఉంది. ఖరీఫ్‌లో వేసిన పంట చివరి కోత దశలో ఉంది. రబీలో సాగు చేసిన తోటల్లో మరో రెండు వారాల్లో కోతకు వచ్చే అవకాశం ఉంది. మైలవరం నియోజకవర్గంలో జి.కొండూరు మండలం గడ్డమణుగు, చెర్వుమాధవరం, గంగినేనిపాలెం, జి.కొండూరు, గుర్రాజుపాలెం గ్రామాల్లో ఖరీఫ్‌, రబీ కలిపి 31 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి, మూలపాడు, దాములూరు గ్రామాల్లో 11 ఎకరాలు, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, మైలవరం, జగ్గయ్యపేట మండలంలో చెదురుమదురుగా అన్నదాతలు టమాటాను సాగు చేస్తున్నారు. పంట కోసి విక్రయానికి తీసుకెళ్తే కేజీ రూ.4 పలుకుతోందని, ప్రభుత్వం నుంచి వస్తున్న విత్తన రాయితీతో పాటు మరిన్ని రాయితీలు వస్తేనే సాగు చేయగలమని రైతులు చెబుతున్నారు.

మార్కెట్‌లో మదనపల్లి ముందు నిలబడలేక..

మార్కెట్‌ హెచ్చుతగ్గులు, పోటీతత్వం కారణంగా ఈప్రాంతలో రైతులు పండించే టమాటాలు బహిరంగ మార్కెట్‌లో మంచి ధర పలకడం లేదు. దీంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. నాణ్యతలో చిత్తూరు, మదనపల్లి టమాటాల ముందు నిలబడలేకపోతున్నాయి. అక్కడి రైతులు ట్రెల్లీస్‌ సాగు ద్వారా కాయలను నాణ్యంగా పండిస్తున్నారు. తీగను కిందకు పాకకుండా, నేలపై కాయలు వాలకుండా సాగు చేస్తారు. దడి సాగు(ట్రెల్లీస్‌)లో కర్రలు పాతి ఐరెన్‌ ఫెన్సింగ్‌ తీగ కట్టి చెట్లను వాటికి పాకిస్తారు. దీంతో టమాటాలు నాణ్యంగా ఉంటున్నాయి. ఈప్రాంతంలోనూ ఇలా సాగు చేస్తే మార్కెట్‌ పోటీని తట్టుకుంటారని ఉద్యాన అధికారులు చెబుతున్నారు.

కోత ఖర్చులు రావడం లేదు

ధర కేజీ రూ.4 పలకడంతో కోత ఖర్చులు కూడా రావడం లేదు. 27 కిలోల ట్రే కోయించేందుకు రూ.40 ఖర్చవుతోంది. రవాణా తదితర ఖర్చులు కలిపితే నష్టమే వస్తోంది. అందుకే తోటలను వదిలేశాం. మరి కొందరు దున్నేస్తున్నారు.

-నూతక్కి నాగేశ్వరరావు, రైతు, గడ్డమణుగు

రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి

టమాటా సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు పెంచాలి. పంట సాగు చేసే వారికి నష్టాలు తప్ప లాభాలు రావడం లేదు. మార్కెట్‌ సౌకర్యం కూడా తక్కు వగా ఉంది. రైతు బజారుకు తీసు కెళ్లి అమ్ముకునే పరిస్థితి లేదు. జి.కొండూరులో రైతు బజారు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు చేకూరుతుంది.

- పాతూరి ఐమోహన్‌రావు, రైతు, గడ్డమణుగు

టమాటా రైతులకు పలు రాయితీలు ఉన్నాయి

టమాటా సాగుచేసే రైతుకు హెక్టారుకు రూ.3 వేలు విత్తన సబ్సిడీ వస్తోంది. ట్రెల్లీస్‌ పద్దతిలో సాగు చేసుకుంటే ఎకరానికి రూ.18,500 రాయితీ వస్తుంది. మల్చింగ్‌కు రాయితీ వస్తుంది. నేల మీద పండే పంటకు ట్రెల్లీ్‌సలో పండించే పం టకు నాణ్యత విషయంలో తేడా ఉంటుంది. నాణ్యమైన కాయలకే మంచి డిమాం డ్‌ ఉంటుంది. -నీలిమ, హెచ్‌వో

Updated Date - Feb 22 , 2025 | 01:48 AM